DWARAM TYAGARAJU
భారము నీపై వేసి బ్రతికియుండుటే మేలు
నారాయణుడా నీవే నాకు గలవనుచు
గోవిందా హరి గోవిందా
గోవిందా భజగోవిందా
శరణన్నా వెరపై సామజము గాచినట్టు
వరుసదావతీ పడి వచ్చేవంటా
హరికృష్ణాయనవెరపై ద్రౌపదివర-
మిరవుగా నిచ్చినట్టు నిచ్చేవో యనుచు
శ్రీనివాసా గోవిందా
శ్రీవేంకటేశా గోవిందా
చేతమొక్కవెరపై చీరలిచ్చి యింతులకు
బాతీపడ్డట్టె నన్ను గైకొనేవంటా
ఆతల సమ్మగ వెరపై పాండవులవలె
గాతరాన వెంట వెంట గాచియుండేవనుచు
గోవిందా హరిగోవిందా
గోవిందా భజగోవిందా
ఆరగించుమన వెరపై శబరి వలె
ఆరయనెంగిలియనకంటేవంటా
యేరీతినన్నువెరతు ఇచ్చైనట్ట్లగావు
కూరిమి శ్రీవేంకటేశ గోవులగాచినట్లు
Baaramu nIpai vEsi bratikiyuMDuTE mElu
naaraayaNuDA nIvE nAku galavanucu
gOviMdA hari gOviMdA
gOviMdA bhajagOviMdA
SaraNannaa verapai saamajamu gaacinaTTu
varusagaavatI paDi vaccEvaMTA
harikRShNaayanaverapai droupadi-
varamiravugaa niccinaTTu niccEvO yanucu
SrInivaasaa gOviMdA
SrIvEMkaTESA gOviMdA
cEtamokkaverapai cIralicci
yiMtulaku baakIpaDDaTTe nannu gaikonEvaMTA
Atala sammaga verapai paaMDavulavale
naataraana veMTa veMTa gaaciyuMDEvanucu
gOviMdA harigOviMdA
gOviMdA bhajagOviMdA
aaragiMcumana verapai Sabari vale
ArayaneMgiliyanakaMTEvaMTA
yErItinannuveratu iccainaTTlagaavu
kUrimi SrIvEMkaTESa gOvulagaacinaTlu
No comments:
Post a Comment