ENTA-CHADIVI
ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక
యింతయు నేలేటిదైవమిక వేరేకలరా
మొదల జగములకు మూలమైనవాడు
తుద ప్రళయమునాడు తోచేవాదు
కదిసి నడుమనిండి కలిగివుండెడివాడు
మదనగురుడేకాక మఱి వేరే కలరా
పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు
సురలకు నరులకు జొటయినవాడు
పరమైనవాడు ప్రపంచమైనవాడు
హరి యొక్కడేకాక యవ్వలను గలరా
ఫుట్టుగులయినవాడు భోగమోక్షాలైనవాడు
యెట్టనెదుర లోనను యిన్నిటివాడు
ఘట్టిగా శ్రీవేంకటాద్రి కమలాదేవితోడి
ఫట్టపుదేవుడేకాక పరులిక గలరా
emta chadivi choochina neetaDE ghanamugaaka
yimtayu naelaeTidaivamika vaeraekalaraa
modala jagamulaku moolamainavaaDu
tuda praLayamunaaDu tOchEvaadu
kadisi naDumanimDi kaligivumDeDivaaDu
madanaguruDEkaaka ma~ri vaerae kalaraa
paramaaNuvainavaaDu brahmaamDamainavaaDu
suralaku narulaku joTayinavaaDu
paramainavaaDu prapamchamainavaaDu
hari yokkaDaekaaka yavvalanu galaraa
PuTTugulayinavaaDu bhOgamOkshaalainavaaDu
yeTTanedura lOnanu yinniTivaaDu
GaTTigaa SreevaemkaTaadri kamalaadaevitODi
PaTTapudaevuDaekaaka parulika galaraa
No comments:
Post a Comment