SRIVENKATESA
శ్రీ వేంకటేశ రాజీవాక్ష మేలుకొనవే
వేగవేగ మేలుకొను వెలిఛాయలమరే
సురలు గంధర్వకిన్నరులెల్ల గూడి తం-
బురుశ్రుతులను జేర్చి సరవిగాను
అరుణోదయము దెలిసి హరిహరి యనుచు నర-
హరి నిన్ను దలచెదరు హంసస్వరూప
అల చిలుకపలుకులకు నధరబింబము బొలె
తెలివి దిక్కుల మిగులతేటబారే
అలరు కుచగిరుల నుదయాస్తాద్రిపైవెలిగె
మలినములు తొలగనిదొ మంచుతెరవిచ్చే
తలుకొత్త నిందిరా తాతంకరైరుచుల
వెలిగన్నుతామరలు వికసింపగాను
అలర్మేల్ మంగ శ్రీవేంకటాచలరమణ
చెలువు మీఱగను ముఖకళలు గనవచ్చే
Sree vEMkaTESa raajeevaaksha maelukonavae
Vaegavaega maelukonu veliCaayalamarae
suralu gamdharvakinnarulella gooDi tam-
buruSrutulanu jaerchi saravigaanu
aruNOdayamu delisi harihari yanuchu nara-
hari ninnu dalachedaru hamsasvaroopa
ala chilukapalukulaku nadharabimbamu bole
telivi dikkula migulataeTabaarae
alaru kuchagirula nudayaastaadripaivelige
malinamulu tolaganido mamchuteravichchae
talukotta nimdiraa taatamkarairuchula
veligannutaamaralu vikasimpagaanu
alarmael^ mamga SreevEMkaTaachalaramaNa
celuvu mee~raganu mukhakaLalu ganavachchae
No comments:
Post a Comment