BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday, 15 December 2010

ANNMAYYA SAMKIRTANALU__MELUKOLUPU




BKP

మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల
మేలుకోవె నాపాలి మించిన నిధానమా ||


సందడిచే గోపికల జవ్వనవనములోన
కందువందిరిగే మదగజమవు |
యిందుముఖి సత్యభామ హృదయపద్మములోని
గంధము మరిగినట్టి గండుతుమ్మెద ||


గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో
రతిముద్దు గురిసేటి రాచిలుకా |
సతుల పదారువేల జంట కన్నుల గలువల-
కితమై పొడిమిన నా యిందుబింబమ ||


వరుస గొలనిలోని వారి చన్నుంగొండలపై
నిరతి వాలిన నా నీలమేఘమా |
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద
గరిమ వరాలిచ్చే కల్పతరువా ||
mElukO SRMgArarAya mETi madanagOpAla
mElukOve nApAli miMcina nidhAnamA ||

saMdaDicE gOpikala javvanavanamulOna
kaMduvaMdirigE madagajamavu |
yiMdumuKi satyaBAma hRdayapadmamulOni
gaMdhamu mariginaTTi gaMDutummeda ||

gatigUDi rukmiNikaugiTa paMjaramulO
ratimuddu gurisETi rAcilukA |
satula padAruvEla jaMTa kannula galuvala-
kitamai poDimina nA yiMdubiMbama ||

varusa golanilOni vAri cannuMgoMDalapai
nirati vAlina nA nIlamEGamA |
Siranuramuna mOci SrI vEMkaTAdri mIda
garima varAliccE kalpataruvA ||

ఈనాడు ధనుస్సంక్రమణం సందర్భంలో ఈ మేలుకొలుపు దేవదేవునికి..
InADu dhanussaMkramaNaM saMdarbhaMlO I mElukolupu dEvadEvuniki..

No comments:

Post a Comment