BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday 15 December, 2010

ANNAMAYYA SAMKIRTANALU__VENKATADRI




ade_chUDu_tiruvEMkaTAdri


అదెచూడు తిరువేంకటాద్రి నాలుగుయుగము- | లందు వెలుగొందీ ప్రభమీరగాను ||


తగ నూటయిరువై యెనిమిదితిరుపతుల గల- | స్థానికులును చక్రవర్తిపీఠకమలములును | అగణితంబైన దేశాంత్రులమఠంబులును | నధికమై చెలువొందగాను ||


మిగులనున్నతములగుమేడలును మాడుగులు | మితిలేనిదివ్యతపస్సులున్న గౄహములును | వొగి నొరగు బెరుమాళ్ళ వునికిపట్టయి వెలయు- | దిగువ తిరుపతి గడవగాను ||


పొదలి యరయోజనముపొడవునను బొలుపొంది | పదినొండుయోజనంబులపరపునను బరగి | చెదర కేవంకచూచిన మహాభూజములు | సింహశార్దూలములును ||


కదిసి సురవరులు కిన్నరులు కింపురుషులును | గరుడగంధర్వయక్షులును విద్యాధరులు | విదితమై విహరించువిశ్రాంతదేశముల | వేడుకలు దైవారగాను||


యెక్కువలకెక్కువై యెసగి వెలసినపెద్ద- | యెక్కు డతిశయముగా నెక్కినంతటిమీద | అకజంబైన పల్లవరాయనిమటము | అల్లయేట్ల పేడ గడవన్ ||


చక్కనేగుచు నవ్వచరి గడచి హరి దలచి | మ్రొక్కుచును మోకాళ్ళముడుగు గడచినమీద- | నక్కడక్కడ వేంకటాద్రీశుసంపదలు | అంతంత గానరాగాను ||


బుగులుకొనుపరిమళంబుల పూవుదోటలును | పొందైన నానావిధంబుల వనంబులును | నిగడి కిక్కిరిసి పండినమహావృక్షముల- | నీడలను నిలిచి నిలిచి ||


గగనంబుదాకి శృంగార రసభరితమై | కనకమయమైన గోపురములను జెలువొంది | జగతీధరుని దివ్యసంపదలు గలనగరు | సరుగనను గానరాగాను ||


ప్రాకటంబైన పాపవినాశనములోని | భరితమగుదురితములు పగిలి పారుచునుండ | ఆకాశగంగతోయములు సోకిన భవము- | లంతంత వీడి పారగను ||


యీకడను గోనేట యతులు బాశుపతుల్ మును- | లెన్న నగ్గలమైవున్న వైష్ణవులలో | యేకమై తిరువేంకటాద్రీశు డాదరిని | యేప్రొద్దు విహరించగాను ||





adecUDu tiruvEMkaTAdri nAluguyugamu- | laMdu velugoMdI praBamIragAnu ||


taga nUTayiruvai yenimiditirupatula gala- | sthAnikulunu cakravartipIThakamalamulunu | agaNitaMbaina dESAMtrulamaThaMbulunu | nadhikamai celuvoMdagAnu ||


migulanunnatamulagumEDalunu mADugulu | mitilEnidivyatapassulunna gRuhamulunu | vogi noragu berumALLa vunikipaTTayi velayu- | diguva tirupati gaDavagAnu ||


podali yarayOjanamupoDavunanu bolupoMdi | padinoMDuyOjanaMbulaparapunanu baragi | cedara kEvaMkacUcina mahABUjamulu | siMhaSArdUlamulunu ||


kadisi suravarulu kinnarulu kiMpuruShulunu | garuDagaMdharvayakShulunu vidyAdharulu | viditamai vihariMcuviSrAMtadESamula | vEDukalu daivAragAnu||


yekkuvalakekkuvai yesagi velasinapedda- | yekku DatiSayamugA nekkinaMtaTimIda | akajaMbaina pallavarAyanimaTamu | allayETla pEDa gaDavan ||


cakkanEgucu navvacari gaDaci hari dalaci | mrokkucunu mOkALLamuDugu gaDacinamIda- | nakkaDakkaDa vEMkaTAdrISusaMpadalu | aMtaMta gAnarAgAnu ||


bugulukonuparimaLaMbula pUvudOTalunu | poMdaina nAnAvidhaMbula vanaMbulunu | nigaDi kikkirisi paMDinamahAvRkShamula- | nIDalanu nilici nilici ||


gaganaMbudAki SRMgAra rasaBaritamai | kanakamayamaina gOpuramulanu jeluvoMdi | jagatIdharuni divyasaMpadalu galanagaru | sarugananu gAnarAgAnu ||


prAkaTaMbaina pApavinASanamulOni | Baritamaguduritamulu pagili pArucunuMDa | AkASagaMgatOyamulu sOkina Bavamu- | laMtaMta vIDi pAraganu ||


yIkaDanu gOnETa yatulu bASupatul munu- | lenna naggalamaivunna vaiShNavulalO | yEkamai tiruvEMkaTAdrISu DAdarini | yEproddu vihariMcagAnu ||






No comments:

Post a Comment