BKP
అదివో అల్లదివో శ్రీహరివాసము -
పదివేల శేషుల పడగలమయము
..
అదె వేంకటాచల మఖిలోన్నతము -
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు -
అదె చూడుడదె మ్రొక్కుడానందమయము
..
చెంగట నల్లదివో శేషాచలము -
నింగి నున్నదేవతల నిజవాసము
ముంగిట నల్లదివో మూలనున్నధనము -
బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము
..
కైవల్యపదము వేంకటనగమదివో -
శ్రీ వేంకటపతికి సిరులైనవి
భావింప సకలసంపదరూపమదివో -
పావనములకెల్ల పావనమయము
G.NAGESWARA NAIDU
adivO alladivO Sreeharivaasamu -
padivaela Saeshula paDagalamayamu
..
ade vaeMkaTaachala makhilOnnatamu -
adivO brahmaadula kapuroopamu
adivO nityanivaasa makhilamunulaku -
ade chooDuDade mrokkuDaanaMdamayamu
..
cheMgaTa nalladivO Saeshaachalamu -
niMgi nunnadaevatala nijavaasamu
muMgiTa nalladivO moolanunnadhanamu -
baMgaaru Sikharaala bahu brahmamayamu
..
kaivalyapadamu vaeMkaTanagamadivO -
Sree vaeMkaTapatiki sirulainavi
bhaaviMpa sakalasaMpadaroopamadivO -
paavanamulakella paavanamayamu
SHOBHARAJ
No comments:
Post a Comment