BKP
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను -
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
నారదుడు జపియించె నారాయణ మంత్రము -
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము -
వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె -
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె -
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి -
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను -
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము
KANAKADURGA
anni maMtramulu iMde aavahiMchenu -
vennatO naaku galige vaeMkaTaeSu maMtramu
naaraduDu japiyiMche naaraayaNa maMtramu -
chaere prahlaaduDu naarasiMha maMtramu
kOri vibheeshaNuDu chaekone raama maMtramu -
vaerenaaku galige vaeMkaTaeSu maMtramu
raMgagu vaasudaeva maMtramu dhRvuMDu japiMche -
aMgaviMche kRshNa maMtramu arjunuDu
muMgiTa vishNu maMtramu mogiSukuDu paThiMche -
viMgaDamai naaku nabbe vaeMkaTaeSu maMtramu
inni maMtramula kella iMdiranaathuDe gu~ri -
pannina didiyae parabrahma maMtramu
nannu gaavagaligaebO naaku guruDiyyagaanu -
vennela vaMTidi SreevaeMkaTaeSu maMtramu
No comments:
Post a Comment