BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday, 8 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__LAKSHMINARASIMHA






G.ANIL KUMAR
ఓం నమో వేంకటేశాయ


మొదలివేల్ప మా మొరయాలించవే
యెదుట గావు మము యిదివో దేవా


ధరపై తపసుల తపములు చెరిచెను
నిరతపుణ్యముల నీరుసేసెనదె
పరకామినులను భంగపెట్టెనదే
హిరణ్యకశిపుడు యిదివో దేవా


మనుజులజడలదివో మోపుల కొలదులు
యినచంద్రాదుల నెక్కువ గెలిచెను
సనవరి యింద్రుని స్వర్గము చేకొని
యెనగొని హిరణ్యుడివో దేవా


పలుదిక్పాలుల పారగదోలెను
బలిమిని ప్రహ్లాదు పరచీని
యెలమిని శ్రీవేంకటేశ నీవలన
యిల కశిపుడు చెడెనిదివో దేవా

modalivElpa maa morayaaliMcavE
yeduTa gaavu mamu yidivO dEvA

dharapai tapasula tapamulu cericenu
niratapuNyamula nIrusEsenade
parakaaminulanu bhaMgapeTTenadE
hiraNyakaSipuDu yidivO dEvA

manujulajaDaladivO mOpula koladulu
yinacaMdraadula nekkuva gelicenu
sanavari yiMdruni swargamu cEkoni
yenagoni hiraNyuDivO dEvA

paludikpaalula paaragadOlenu
balimini prahlaadu paracIni
yelamini SrIvEMkaTESa nIvalana
yila kaSipuDu ceDenidivO dEvA

No comments:

Post a Comment