BKP
ఆంజనేయ అనిలజ హనుమంతా నీ
రంజకపు చేతలు సురలకెంచ వశమా
తేరిమీద నీరూపు తెచ్చిపెట్టి అర్జునుడు
కౌరవుల గెలిచె సంగరభూమిని
సారెకు భీముడు పురుషామృతము తెచ్చుచోట
నీరోమములుకావా నిఖిల కారణము
నీమూలమునగాదె నెలవై సుగ్రీవుడు
రాముని కొలిచి కపిరాజాయెను
రాముడు నీవంకనేపో రమణి సీతదేవి
ప్రేమముతో మగుడను పెండ్లాడెను
బలుదైత్యులను దుంచ బంటుతనము మించ
కలకాలమునునెంచ కలిగితిగా
అలశ్రీవేంకటపతి అండనే మంగాంబుధి-
నిలయపు హనుమంత నెగడితిగా
G.NAGESWARA NAIDU
AMjanEya anilaja hanumaMtA nI
raMjakapu cEtalu suralakeMca vaSamaa
tErimIda nIrUpu teccipeTTi arjunuDu
kouravula gelice saMgarabhUmini
saareku BImuDu puruShaamRutamu teccucOTa nI
rOmamulukaavaa nikhila kaaraNamu
nImUlamunagaade nelavai sugrIvuDu
raamuni kolici kapiraajaayenu
raamuDu nIvaMkanEpO ramaNi sItadEvi
prEmamutO mageDanu peMDlaaDenu
baludaityulanu duMca baMTutanamu miMca
kalakaalamununeMca kaligitigaa
alaSrIvEMkaTapati aMDanE maMgAMbudhi-
nilayapu hanumaMta negaDitigaa
ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA NO--458
RAGAM MENTIONED--RAMAKRIYA
No comments:
Post a Comment