BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday, 17 December 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU




N.C.SATYANARAYANA

జీవితంలో ప్రతి విషయానికి ఓ మార్గం ఉంటుంది. అలాగే శ్రీహరి భక్తులుగా మారడానికి సైతం ఓ మార్గం వేచి ఉంటుంది. అన్నమయ్య మాత్రం... హరిదాసులు అయితే చాలు... మిగిలినవన్నీ దానంతట అవే సంప్రాప్తిస్తాయి అని చెబుతున్నారు. అంతే కాదు వారి లక్షణాలు ఏవో కూడా చెబుతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే భగవద్గీతతో చెప్పిన స్థితప్రజ్ఞతే ఇది.......

హరిదాసుండగుటే యది తపము
పరమార్థములను ఫలమేలేదు



తిట్టినయప్పుడు దీవించి నప్పుడు
అట్టె సమమగునది తపము
వట్టినేమములు వేవేలు చేసినా
బట్టబయలే గాని ఫలమే లేదు

ఇచ్చిన యప్పుడు ఇయ్యని యప్పుడు
అచ్చుగ నవ్విన దది తపము
ఇచ్చల పుణ్యము లెన్ని చేసినా
బచ్చన లింతే ఫలమే లేదు

కూడిన యప్పుడు గొణగిన యప్పుడు
ఆడిక విడిచిన యది తపము
ఈడనే శ్రీవేంకటేశుడే శరణము
పాడి పంతముల ఫలమే లేదు





No comments:

Post a Comment