
SHOBHARAJ
గడ్డపారమింగితే ఆకలితీరీనా యీ-
వొడ్డినభవము దన్ను వొడకమ్ముగాక
చించుక మిన్నులబారేచింకలను బండిగట్టి
వంచుకొనేమన్న నవి వసమయ్యీనా
యెంచరాని యింద్రియము లెవ్వరికి నేలచిక్కు
పొంచి పొంచి వలపుల బొండబెట్టుగాక
మంటండేయగ్గిదెచ్చి మసిపాత మూటగట్టి
యింటిలోన దాచుకొన్న నితవయ్యీనా
దంటమంకారమిట్టే తన్నునేల సాగనిచ్చు
బంటుజేసి ఆసలనే పారదోసుగాక
పట్టరానివిషముల పాముదెచ్చి తలకింద
బెట్టుకొన్నానది మందపిలి వుండీనా
వెట్టసంసారమిది వేంకటేశుగొలువని-
వట్టిమనుజుల పెడవాడబెట్టుగాక
gaDDapAramimgitE AkalitIrInA yI-
voDDinabhavamu dannu voDakammugAka
ciMcuka minnulabArEciMkalanu baMDigaTTi
vaMcukonEmanna navi vasamayyInA
yeMcarAni yimdriyamu levvariki nElacikku
pomci pomci valapula bomDabeTTugAka
maMTamDEyaggidecci masipAta mUTagaTTi
yiMTilOna dAcukonna nitavayyInA
daMTamamkAramiTTE tannunEla sAganiccu
baMTujEsi AsalanE pAradOsugAka
paTTarAniviShamula pAmudecci talakiMda
beTTukonnAnadi mamdapili vuMDInA
veTTasamsAramidi vEMkaTESugoluvani-
vaTTimanujula peDavADabeTTugAka
ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA NO--177
RAGAM MENTIONED--KAMBODI
No comments:
Post a Comment