
CKP
చింతలురేచకు మమ్ము చిత్తమా నీవు
పంతముతో మముగూడి బతుకుమీ నీవు
తల్లి శ్రీమహాలక్ష్మి తండ్రి వాసుదేవుడు
యిల్లు మాకు బ్రహ్మాండమింతా నిదె
బల్లిదపుహరిభక్తి పాడీ బంటా నాకు
వొల్లము కర్మఫలములొకటినేము
జ్ఞానమేమాకు ధనము సర్వవేదములు సొమ్ము
వూనిన వైరాగ్యమే వుంబళి మాకు
ఆనిన గురుసేవలు ఆడుబిడ్డలు నాకు
మేనితోనే తగులాయ మేలు మాకుజేరెను
యేలికె శ్రీవేంకటేశుడింటిదేవపూజ మాకు
పాలుగలబంధువులు ప్రపన్నులు
కీలు మాకు నీతనిసంకీర్తన మోక్షమునకు
యేలా యింకా మాకు నేమిటితో గొడవ
cimtalurEcaku mammu cittamaa nIvu
paMtamutO mamugUDi batukumI nIvu
talli SrImahAlakShmi taMDri vAsudEvuDu
yillu mAku brahmAMDamiMtA nide
ballidapuharibhakti pADI baMTA nAku
vollamu karmaphalamulokaTinEmu
j~nAnamEmaaku dhanamu sarvavEdamulu sommu
vUnina vairAgyamE vuMbaLi mAku
Anina gurusEvalu ADubiDDalu nAku
mEnitOnE tagulAya mElu mAkujErenu
yElike SrIvEmkaTESuDiMTidEvapUja mAku
pAlugalabaMdhuvulu prapannulu
kIlu mAku nItanisaMkIrtana mOkShamunaku
yElA yiMkA mAku nEmiTitO goDava
ANNAMAYYA LYRICS BOOK NO--3
SAMKIRTANA NO--63
RAGAM MENTIONED--GOULA
No comments:
Post a Comment