
G.MADHUSUADANA RAO
తలపులోపలితలపు దైవమితడు
పలుమారు బదియును బదియైనతలపు
సవతైన చదువులు సరుగతెచ్చిన తలపు
రవళి దరిగుబ్బలిని రంజిల్లు తలపు
కవగూడగోరి భూకాంత ముంగిటితలపు
తివిరి దూషకు గోళ్ళ దెగటార్చుతలపు
గొడగువట్టినవాని గోరి యడిగిన తలపు
తడబడక విప్రులకు దానమిడు తలపు
వొడిసిజలనిధిని గడగూర్చి తెచ్చిన తలపు
జడియక హలాయుధము జళిపించు తలపు
వలపించి పురసతులవ్రతము చెరచిన తలపు
కలికితనములు చూపగలిగున్న తలపు
యిలవేంకటాద్రిపై నిరవుకొన్న తలపు
కలుషహరమై మోక్షగతిచూపుతలపు
talapulOpalitalapu daivamitaDu
palumAru badiyunu badiyainatalapu
savataina caduvulu sarugateccina talapu
ravaLi darigubbalini ramjillu talapu
kavagUDagOri bhUkAMta mumgiTitalapu
tiviri dUShaku gOLLa degaTArcutalapu
goDaguvaTTinavAni gOri yaDigina talapu
taDabaDaka viprulaku dAnamiDu talapu
voDisijalanidhini gaDagUrci teccina talapu
jaDiyaka halAyudhamu jaLipiMcu talapu
valapimci purasatulavratamu ceracina talapu
kalikitanamulu cUpagaligunna talapu
yilavEMkaTAdripai niravukonna talapu
kaluShaharamai mOkShagaticUputalapu
ANNAMAYYA LYRICS BOOK NO--1
SAMKIRTANA NO --356
RAGAM MENTIONED---VASAMTAM
No comments:
Post a Comment