BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday 29 June, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM





G.N.NAIDU?

అడుగరె యీమాట అతని మీరందరును
యెడయనిచోటను యిగిరించు ప్రియము


పొరపొచ్చమగుచోట పొసగవు మాటలు
గరిమనొరసితేను కలగు మతి
సరవులులేనిచోట చలము వెగ్గళమవును
నొరసి పెనగేచోట నుమ్మగిలు వలపు


వొలసీనొల్లనిచోట వొనరవు నగవులు
బలిమి చేసేటిచోట పంతమురాదు
అలుకలుచూపేచోట అమరదు వియము
చలివాసి వుండేచోట చండిపడు పనులు


ననుపులేనిచోట నమ్మికచాలదు పొందు
అనుమానమైనచోట నంటదు రతి
యెనసినాడు శ్రీవేంకటేశుడు నన్నింతలోనె
తనివిలేనిచోట దైవారు గోర్కులు


aDugare yImATa atani mIramdarunu
yeDayanicOTanu yigiriMcu priyamu


porapoccamagucOta posagavu mATalu
garimanorasitEnu kalagu mati
saravululEnicOTa calamu veggaLamavunu
norasi penagEcOTa nummagilu valapu


volasInollanicOTa vonaravu nagavulu
balimi cEsETicOTa paMtamurAdu
alukalucUpEcOTa amaradu vinayamu
calivAsi vuMDEcOTa caMDipaDu panulu


nanupulEnicOTa nammikacAladu poMdu
anumAnamainacOTa naMTadu rati
yenasinADu SrIvEMkaTESuDu nanniMtalOne
tanivilEnicOTa daivAru gOrkulu






ANNAMAYYA LYRICS BOOK NO--24
SAMKIRTANA NO--498
RAGAM MENTIONE--SALAMGAM

1 comment:

  1. చక్కని బ్లాగు. మీ కృషి అభినందనీయం. ధన్యవాదములు

    ReplyDelete