BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday 15 June, 2012

ANNAMAYYA SAMKIRTANALU--HANUMAN


BKP


అదెచూడరయ్యా పెద్దహనుమంతుని
గుదిగొని దేవతలు గొనియాడేరయ్యా


వుదయాస్తశైలములు వొకజంకగా జాచె
అదివోధ్రువమండలమందె శిరసు
చదివె సూర్యునివెంట సారె మొగము ద్రిప్పుచు
యెదుట నీతనిమహిమేమని చెప్పేమయ్యా


దండిగా బ్రహ్మాందముదాక దోకమీదికెత్తె
మెండగుదిక్కులు నిండ మేనువెంచెను
గుండుగూడ రాకాసుల గొట్టగ జేతులుచాచి
అండనీతని ప్రతాపమేమరుదరుదయ్యా


దిక్కులుపిక్కటిల్లగ దేహరోమములు వెంచె
పక్కన లోకములకు ప్రాణమినిల్చె
యిక్కడ శ్రీవేంకటేశు హితవరిబంటాయ
మిక్కిలినీతనిలావు మేలుమేలయ్యా



adecUDarayyaa peddahanumaMtuni
gudigoni dEvatalu goniyADErayyA


vudayaastaSailamulu vokajaMkagA jAce
adivOdhruvamaMDalamaMde Sirasu
cadive sUryuniveMTa sAre mogamu drippucu
yeduTa nItanimahimEmani ceppEmayyaa


daMDigA brahmAMdamudAka dOkamIdikette
meMDagudikkulu niMDa mEnuveMcenu
guMDugUDa rAkaasula goTTaga jEtulucAci
aMDanItani pratApamEmarudarudayyaa


dikkulupikkaTillaga dEharOmamulu veMce
pakkana lOkamulaku prANaminilce
yikkaDa SrIvEMkaTESu hitavaribaMTAya
mikkilinItanilAvu mElumElayyA


ANNAMAYYA LYRICS BOOK NO--4
SAMKIRTANA--509
RAGAM MENTIONED--BOULI

No comments:

Post a Comment