BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday 10 May, 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM




BKP
పొందెఱుగుదునందువు భోగినందువు నీ-
అందరు సతులకు నేనాకుమడిచి యిత్తునా


ఎవ్వతెకైనా చనవిచ్చేవు మెచ్చేవు నీ-
నవ్వులకైనాను మన్నన జూచేవు
అవ్వలి యివ్వలి నీయంగనల వొద్దను
పవ్వళించివుండగా నే పాదములొత్తుదునా


ఏపుననెక్కడికైనా నేగేవు దాగేవు నీ-
కోపాన నాతోనైనా మేకులు సేసేవు
వైపున నీవెందుండైనా వచ్చిన నేనంతలో
వోపికనప్పుడు నీకూడిగాలు సేతునా


వేడుకలెందైనా పారవేసేవు నీ-
వాడికచేతలెన్నైనా వన్నెవెట్టేవు
యీడులేని తిరువేంకటేశ కూడితివి నన్ను
వాడుచు నీతోడ నేను వాసి చూపగలనా

pomde~rugudunamduvu bhOginamduvu nI-
amdaru satulaku nEnAkumaDici yittunA


evvatekainA canaviccEvu meccEvu nI-
navvulakainAnu mannana jUcEvu
avvali yivvali nIyamganala voddanu
pavvaLimcivumDagA nE pAdamulottudunA


EpunanekkaDikainA nEgEvu dAgEvu nI-
kOpAna nAtOnainA mEkulu sEsEvu
vaipuna nIvemdumDainA vaccina nEnamtalO
vOpikanappuDu nIkUDigAlu sEtunA


vEDukaleMdainaa paaravEsEvu nI-
vADikacEtalennainA vanneveTTEvu
yIDulEni tiruvEMkaTESa kUDitivi nannu
vADucu nItODa nEnu vAsi cUpagalanA




ANNAMAYYA LYRICS BOOK NO--5
SAMKIRTANA--65
RAGAM MENTIONED--KAMBODHI


No comments:

Post a Comment