BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday 6 April, 2012

ANNAMAYYA SAMKIRTANALU__SRUNGARAM


SARALARAO



కానీవే అందుకేమీ కనొకొనేపనులెల్ల
యీనాటకములు నేనెఱగనివా

పంతములాడిన తానే భ్రమసీ గాక నాకు
యింతలోనె యేమిదప్పెనెందువోయీని
వింతయడవులవెంట వెదకడా సీతదొల్లి
యెంతలేదు తనగుండె యెఱగనిదా

బిగియుచునున్న వాడే బిలిచీగాక నన్ను
తగవులే నెరపేను దానికేమే
వెగటయి రాధాదేవివెంటవెంట దిరుగడా
యెగువనె తనగుట్టు యెఱగనిదా


కడలనున్నవాడే కలసీగాక నన్ను
తడవకు వానినిట్టె తతి రానీవే
అడరి శ్రీవేంకటేశుడట్టె నన్ను గలసె
యెడయకున్నాడు నేనిది యెఱగనిదా
kAnIvE amdukEmI kanokonEpanulella
yInATakamulu nEne~raganivA

pamtamulADina tAnE bhramasI gAka nAku
yimtalOne yEmidappeneMduvOyIni
vimtayaDavulaveMTa vedakaDA sItadolli
yemtalEdu tanaguMDe ye~raganidA



bigiyucununna vADE bilicIgAka nannu
tagavulE nerapEnu dAnikEmE
vegaTayi rAdhAdEvivemTaveMTa dirugaDA
yeguvane tanaguTTu ye~raganidA

kaDalanunnavADE kalasIgAka nannu
taDavaku vAniniTTe tati rAnIvE
aDari SrIvEMkaTESuDaTTe nannu galase
yeDayakunnADu nEnidi ye~raganidA


ANNAMAYYA LYRICS BOOK NO--12
SAMKIRTANA NO--15
RAGAM MENTIONED--SAMKARABHARANAM

No comments:

Post a Comment