BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday 30 March, 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU



SHOBHARAJ

ఇందువల్లనేమికద్దు యినుపగుగ్గిళ్ళంతే
యిందిరారమణుసేవే యిరవైన పదవి


సతులతోనవ్వులు చందమామగుటుకలు
మతితలపోతలెండమావులనీళ్ళు
రతులలోమాటలు రావిమానిపువ్వులు
తతివిరహపుకాక తాటిమానినీడ


లలనల జవ్వనాలు లక్కపూసకపురులు
నెలకొనిసేసేబత్తి నీటిపై వ్రాత
చెలువపువినయాలు చేమకూరశైత్యాలు
కొలదిలేనిననుపు గోడమీది సున్నము




పడతులవేడుకలు పచ్చివడగండ్లగుళ్ళు
కడుమోవితీపి చింతకాయ కజ్జము
బడినలమేలుమంగపతి శ్రీవేంకటేశ్వరుడు
యడరించిన మాయలు అద్దములో నీడలు

imduvallanEmikaddu yinupaguggiLLamtE
yimdirAramaNusEvE yiravaina padavi


satulatOnavvulu camdamaamaguTukalu
matitalapOtaleMDamaavulanILLu
ratulalOmATalu rAvimaanipuvvulu
tativirahapukAka tATimAninIDa


lalanala javvanAlu lakkapUsakapurulu
nelakonisEsEbatti nITipai vrAta
celuvapuvinayaalu cEmakUraSaityAlu
koladilEninanupu gODamIdi sunnamu




paDatulavEDukalu paccivaDagaMDlaguLLu
kaDumOvitIpi cimtakAya kajjamu
baDinalamElumaMgapati SrIvEMkaTESwaruDu
yaDariMcina mAyalu addamulO nIDalu
ANNAMAYYA  LYRICS BOOK NO--2
SAMKIRTANA--268
RAGAM MENTIONED--MUKHARI








No comments:

Post a Comment