BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday 29 March, 2012

ANNAMAYYA SAMIRTANALU--RAMA


SHOBHARAJ

రామా రామభద్ర రవివంశ రాఘవ
యేమి యరుదిది నీకింతటివానికి


నాడు రావణు తలలు నరకినలావరివి
నేడు నాపాపములు ఖండించరాదా
వాడిప్రతాపముతోడ వారిధిగట్టిన నాటి-
వాడవిట్టె నామనోవార్ధిగట్టరాదా


తనిసి కుంభకర్ణాదిదైత్యుల గెలిచితివి
కినిసి నాయింద్రియాల గెలువరాదా
యెనసి హరుని విల్లు యెక్కుపెట్టి వంచి
ఘనము నాదుర్గుణము కడువంచరాదా


సరుస విభీషణుడు శరణంటే గాచితివి
గరిమనేశరణంటి గావరాదా
తొరలి శ్రీవేంకటేశ దొడ్డుగొంచమెంచనేల
యిరవై లోకహితానకేదైనానేమి
rAmA rAmabhadra ravivaMSa rAghava
yEmi yarudidi nIkiMtaTivAniki

nADu rAvaNu talalu narakinalAvarivi
nEDu nApApamulu khaMDimcarAdA
vADipratApamutODa vAridhigaTTina nATi-
vADaviTTe nAmanOvArdhigaTTarAdA

tanisi kuMbhakarNAdidaityula gelicitivi
kinisi nAyimdriyAla geluvarAdA
yenasi haruni villu yekkupeTTi vamci
ghanamu nAdurguNamu kaDuvaMcarAdA

sarusa vibhIShaNuDu SaraNamTE gAcitivi
garimanESaraNamTi gAvarAdA
torali SrIvEMkaTESa doDDugomcamemcanEla
yiravai lOkahitAnakEdainAnEmi
ANNAMAYYA LYRICS BOOK NO--2
SAMKIRTANA NO--437
RAGAM MENTIONED--SALAMGANATA

No comments:

Post a Comment