BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday, 28 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--TATWAMULU


BKP
కడలుడిసి నీరాడగా దలచువారలకు 
కడలేని మనసునకు గడమ యెక్కడిది 

దాహమణగిన వెనక తత్త్వమెరి గెదనన్న 

దాహమేలణగు తా తత్త్వమేమెరుగు 
దేహంబుగల యన్ని దినములకు పదార్థ-

మోహమేలుడుగుదా ముదమేల కలుగు 

ముందరెరిగిన వెనుకమొదలు మరచెదనన్న 

ముందరేమెరుగుదా మొదలేల మరచు 
అందముగ దిరువేంకటాద్రీశు మన్ననల 

కందు వెరిగిన మేలు కలనైన లేదు 


kaDaluDisi nIrADagA dalacuvAralaku 
kaDalEni manasunaku gaDama yekkaDidi 

dAhamaNagina venaka tattvameri gedananna 

dAhamElaNagu tA tattvamEmerugu 
dEhaMbugala yanni dinamulaku padArtha 

mOhamEluDugudA mudamEla kalugu 

muMdarerigina venukamodalu maracedananna 

muMdarEmerugudA modalEla maracu 
aMdamuga diruvEMkaTAdrISu mannanala 

kaMdu verigina mElu kalanaina lEdu 

No comments:

Post a Comment