BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Sunday, 12 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--SRUNGARAM



AUDIO


ఎటువంటి భోగివీడెటువంటి జాణ
వటపత్రముననున్నవాడా వీడు

పొదిగిన పూచిన పున్నాగతరులలో పొదలుపుప్పొళ్ళపై పూదెనే సోనలు
కదలుచు జడివానకాలంపు పెదపెద్ద నదులై పారనున్నతిని
కదలని నడిగడ్డ కల్పభూజంబుల పదిలమైన నీడ బంగారు చవికెలో
కదిసిన జలరాశి కన్నె కౌగిటగూడి వదలకెప్పుడునున్నవాడా వీడు

వలనగు తావుల వాసంతికలలోన కెలకులనరమోడ్పు గెందామరలయందు
పొలయుచు గొజ్జంగపూవులధూళితో లలితంపుగాలి చల్లగనూ
కొలదిమీరిన మంచికోనేటి పన్నీటి జలములోనున్న జలజముఖులు తాను
అలరుచు తగనోలలాడుచునేప్రొద్దు వలపులు చల్లిన వాడా వీడు

లోకములోపలి లోలలోచనలెల్లా జోకైన తనవాలుచూపులచే జిక్కి
యీకడాకడ చూడనెరుగక నిజమైన సాకరమునకె మెచ్చగను
పైకొన్న సరసపు పలుకుల కరగించి ఏకాంతమున సౌఖ్యమెల్ల చేకొనుచుతా--
నీకడ తిరువేమకటేశుడైయున్నాడు వైకుంఠపతియైనవాడా వీడు



eTuvaMTi bhOgivIDeTuvaMTi jaaNa
vaTapatramunanunnavADA vIDu


podigina pUcina punnaagatarulalO podalupuppoLLapai pUdenE sOnalu
kadalucu jaDivaanakaalampu pedapedda nadulai paaranunnatini
kadalani naDigaDDa kalpabhUjambula padilamaina nIDa bamgaaru cavikelO
kadisina jalaraaSi kanne kougiTagUDi vadalakeppuDununnavADA vIDu


valanagu taavula vaasamtikalalOna kelakulanaramODpu gemdaamaralayamdu
polayucu gojjamgapUvuladhULitO lalitampugaali callaganU
koladimIrina mamcikOnETi pannITi jalamulOnunna jalajamukhulu taanu
alarucu taganOlalaaDucunEproddu valapulu callina vaaDA vIDu


lOkamulOpali lOlalOcanalellaa jOkaina tanavaalucUpulacE jikki
yIkaDAkaDa cUDanerugaka nijamaina saakaramunake meccaganu
paikonna sarasapu palukula karagimci Ekaamtamuna soukhyamella cEkonucutaa--
nIkaDa tiruvEmakaTESuDaiyunnADu vaikumThapatiyainavaaDA vIDu




No comments:

Post a Comment