BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Thursday, 23 February 2012

ANNAMAYYA SAMKIRTANALU--RAMA


PARUPALLI BROS

రామభద్ర రఘువీర రవివంశతిలక నీ-
నామమే కామధేనువు నమో నమో 

కౌసల్యానందవర్ధన ఘన దశరథసుత 

భాసురయజ్ఞరక్షక భరతాగ్రజ 
రాసికెక్కు కోదండరచన విద్యాగురువ 

వాసితో సురలు నిను పడి మెచ్చేరయ్యా 

మారీచసుబాహు మర్దన తాటకాంతక 

దారుణ వీరశేఖర ధర్మపాలక 
కారుణ్యరత్నాకర కాకాసురవరద

సారెకు వేదములు జయవెట్టేరయ్యా 

సీతారమణ రాజశేఖరశిరోమణి 

భూతలపుటయోధ్యా పురనిలయా 
యీతల శ్రీవేంకటాద్రి నిరవయినరాఘవ 

ఘాత నీప్రతాపమెల్లా గడు నిండెనయ్యా 


rAmaBadra raGuvIra ravivaMSatilaka nI- 
nAmamE kAmadhEnuvu namO namO 

kausalyAnaMdavardhana Gana daSarathasuta 

BAsurayaj~jarakShaka BaratAgraja 
rAsikekku kOdaMDaracana vidyAguruva 

vAsitO suralu ninu paDi meccErayyA 

mArIcasubAhu mardana tATakAMtaka 

dAruNa vIraSEKara dharmapAlaka 
kAruNyaratnAkara kAkAsuravarada 

sAreku vEdamulu jayaveTTErayyA 

sItAramaNa rAjaSEKaraSirOmaNi 

BUtalapuTayOdhyA puranilayA 
yItala SrIvEMkaTAdri niravayinarAGava 

GAta nIpratApamellA gaDu niMDenayyA 

No comments:

Post a Comment