BKP
ఇహపరములకును ఏలికవు
బహురూపంబుల ప్రహ్లాదవరదుడు
వేయికరంబుల వివిధాయుధంబుల
దాయల నడచిన దైవమవు
నీయందున్నవి నిఖిల జగంబులు
పాయక మమ్మేలు ప్రహ్లాదవరద
కదిమి దుష్టులను గతము చేసితివి
త్రిదశుల గాచిన దేవుడవు
వదల కిందరికి వరములొసంగగ
బ్రతికితి మిదివో ప్రహ్లాదవరద
శ్రీవల్లభుడవు చిత్తజగురుడవు
కావలసినచో కలుగుదువు
శ్రీవేంకటాద్రిని శ్రీ అహోబలాన
భావింతు నీమూర్తి ప్రహ్లద వరద
ihaparamulakunu Elikavu
bahurUpaMbula prahlAdavaraduDu
vEyikaraMbula vividhAyudhaMbula
dAyala naDacina daivamavu
nIyaMdunnavi niKila jagaMbulu
pAyaka mammElu prahlAdavarada
kadimi duShTulanu gatamu cEsitivi
tridaSula gAcina dEvuDavu
vadala kiMdariki varamulosaMgaga
bratikiti midivO prahlAdavarada
SrIvallaBuDavu cittajaguruDavu
kAvalasinacO kaluguduvu
SrIvEMkaTAdrini SrI ahObalAna
BAviMtu nImUrti prahlada varada
No comments:
Post a Comment