KOUSALYA
ఆతడు నీవాడినట్టే అన్ని పనులును సేసు
శ్రీతరుణివి మమ్ము రక్షించవమ్మ
ఏలవమ్మ మమ్మును ఎక్కితివి పతిఉరము
నీలీలలు ఏమిచేసినా నీకు చెల్లును
బాలకివన్నిట నీవు పనిగొంటివాతనిని
ఈలు నీచేనున్నది రక్షించవమ్మ
మన్నించవమ్మ మమ్ము మగడు నీచేతివాడు
సన్నల నీచేతలెల్లా సాగివచ్చీనీ
అన్నిటా చక్కనిదానవు అటమీదట దొరవు
ఎన్నికకెక్కే నీబ్రతుకిక గావవమ్మా
ఈడేరించవమ్మ మమ్మునిట్టే అలమేల్మంగవు
కూడితి శ్రీవేంకటేశు కోరినట్టెల్లా
ఈడులేనిదానవు నే మూడిగాలవారమిదే
వేడుకలెల్లా నీసొమ్మే వెలయించవమ్మా
aataDu nIvADinaTTE annipanulunu sEsu
SrItaruNivi mammu rakShimcavamma
Elavamma mammunu ekkitivi patiuramu
nIlIlalu EmicEsinaa nIku cellunu
baalakivanniTa nIvu panigoMTivaatanini
Ilu nIcEnunnadi rakShimcavamma
mannimcavamma mammu magaDu nIcEtivaaDu
sannala nIcEtalellaa saagivaccInI
anniTA cakkanidaanavu aTamIdaTa doravu
ennikakekkE nIbratukika gaavavammaa
IDEriMcavamma mammuniTTE alamElmaMgavu
kUDiti SrIvEMkaTESu kOrinaTTellA
IDulEnidAnavu nE mUDigaalavaaramidE
vEDukalellA nIsommE velayiMcavammaa
No comments:
Post a Comment