BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Sunday, 4 December 2011

ANNAMAYYA SAMKIRTANALU__BHAGAVADGITA


BKP

భూమిలోన చొచ్చి సర్వభూతప్రాణులనెల్ల
ధీమసాన మోచేటి దేవుడనేను
కామించి సస్యములు కలిగించి చంద్రుడనై
తేమల పండించేటి దేవుడ నేను


అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు వివేకమా


దీపనాగ్నినై జీవదేహముల అన్నములు
యీపులనరగించేటి దేవుడ నేను
ఏపుననిందరిలోని హృదయములోననుందు
దీపింతు తలపు మరపై దేవుడనేను


అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు వివేకమా


వేదములన్నిటిచేత వేదాంతవేత్తలచే
ఆదినేనెరగదగిన ఆ దేవుడను
శ్రీదేవితోగూడి శ్రీవేంకటాద్రిమీద
పాదైన దేవుడను భావించనేను


అని ఆనతిచ్చె కృష్ణుడర్జునునితో
విని ఆతని భజించు వివేకమా



bhUmilOna cocci sarwabhUtapraaNulanella
dhImasaana mOcETi dEvuDanEnu
kaamiMci sasyamulu kaligiMci caMdruDanai
tEmala paMDiMcETi dEvuDa nEnu


ani aanaticce kRShNuDarjununitO
vini Atani bhajiMcu vivEkamaa


dIpanaagninai jIvadEhamula annamulu
yIpulanaragiMcETi dEvuDa nEnu
EpunaniMdarilOni hRdayamulOnanuMdu
dIpiMtu talapu marapai dEvuDanEnu


ani aanaticce kRShNuDarjununitO
vini Atani bhajiMcu vivEkamaa


vEdamulanniTicEta vEdAMtavEttalacE
AdinEneragadagina A dEvuDanu
SrIdEvitOgUDi SrIvEMkaTAdrimIda
paadaina dEvuDanu bhaaviMcanEnu


ani aanaticce kRShNuDarjununitO
vini Atani bhajiMcu vivEkamaa

No comments:

Post a Comment