BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Wednesday, 21 December 2011

ANNAMAYYA SAMKIRTANALU--DANURMASAM




ముదమలర కాలముల మీరిటు మోసపోక
హృదయమలర భజింపరో మీరిటు ధనుర్మాసముల విధులను

వేగనాలుగు ఘడియలనగా వేదవేద్యులు లేచి సరగున
ఆగమోక్తవిధులను తమదేహానుగుణములుగా
వేగమున సంధ్యాదులొగి గావించి విమలాంబోధిశయనుని
బాగుగ పూజించరో యెడపక ధనుర్మాసముల విధులనె ఘనులు

పరగు చీనాంబరములను నతిపరిమళమ్ముల బుష్పముల కడు
వెరవుగా వేంకటపతికి   నైవేద్య సంగతుల
అరుదుగా ధూపముల బహుదీపాదులను తాంబూల విధులను
పరగ పూజింపుడు సమస్తప్రభు ధనుర్మాసమున విధులను ఘనులు

mudamalara kAlamula mIriTu mOsapOka
hRdayamalara bhajiMparO mIriTu dhanurmAsamula vidhulanu


vEganAlugu ghaDiyalanagA vEdavEdyulu lEchi saraguna
nAgamOktavidhulanu tamadEhAnuguNamulugA
vEgamuna saMdhyAdulogi gAviMchi vimalAMbOdhiSayanuni
bAguga pUjiMcharO yeDapaka dhanurmAsamula vidhulane ghanulu


paragu chInAMbaramulanu natiparimaLammula bushpamula kaDu
veravugA vEMkaTapatiki   naivEdya saMgatula
arudugA dhUpamula bahudIpAdulanu tAMbUla vidhulanu
paraga pUjiMpuDu samastaprabhu dhanurmAsamuna vidhulanu ghanulu
ANNAMAYYA LYRICS BOOK NO.4
SAMKIRTANA--45
PAGE NO--391
RAGAM MENTIONED--BHUPALAM

No comments:

Post a Comment