వెనకేదో ముందేదో వెర్రినేను నా-
మనసు మరులుదేర మందేదొకో
చేరి మీదటిజన్మము సిరులకునోమేగాని
యేరూపై పుట్టుదునో యెరుగనేను
కోరి నిద్రించబరచుకొన నుద్యోగింతుగాని
సారెలేతునో లేవనో జాడతెలియ నేను
తెల్లవారినప్పుడెల్లా తెలిసితిననేగాని
కల్లయేదో నిజమేదో కాననేను
వల్లచూచి కామినుల వలపించెగాని
మొల్లమై నా మేను ముదిసినదెరుగ
పాపాలు చేసి మరచి బ్రదుకు చున్నాడగాని
వైపుగ చిత్రగుప్తుడు వ్రాయు టెరుగ
యేపున శ్రీ వేంకటేశుడెక్కడో వెదకే గాని
నా పాలి దైవమని నన్నుగాచుటెరుగ
venakEdO muMdEdO verrinEnu nA-
manasu maruludEra maMdEdokO
cEri mIdaTijanmamu sirulakunOmEgAni
yErUpai puTTudunO yeruganEnu
kOri nidriMcabaracukona nudyOgiMtugAni
sArelEtunO lEvanO jADateliya nEnu
tellavArinappuDellA telisitinanEgAni
kallayEdO nijamEdO kAnanEnu
vallacUci kAminula valapiMcegAni
mollamai nA mEnu mudisinaderuga
pApAlu cEsi maraci braduku cunnADagAni
vaipuga citraguptuDu vrAyu Teruga
yEpuna SrI vEMkaTESuDekkaDO vedakE gAni
nA pAli daivamani nannugAcuTeruga
No comments:
Post a Comment