SRIRANGAM GOPALARATNAM
G.NAGESWARANAIDU---KAPI
నల్లని మేని నగవు చూపుల వాడు
తెల్లని కన్నుల దేవుడు
బిరుసైన దనుజుల పింఛమణచినట్టి
తిరుపు కైదువ తోడి దేవుడు
సరిపడ్డ జగమెల్ల చక్కఛాయకు దెచ్చి
తెరవుచూపినట్టి దేవుడు
BKP
నీటగలసినట్టి నిండిన చదువులు
తేట పరచినట్టి దేవుడు
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు
తీట రాసినట్టి దేవుడు
గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న
తిరువేంకటాద్రిపై దేవుడు
తిరముగ ధౄవునికి దివ్యపదంబిచ్చి
తెరచి రాజన్నట్టి దేవుడు
nallani mEni nagavu cUpula vADu
tellani kannula dEvuDu
birusaina danujula piMCamaNacinaTTi
tirupu kaiduva tODi dEvuDu
saripaDDa jagamella cakkaCAyaku dechchi
teravucUpinaTTi dEvuDu
nITagalasinaTTi niMDina caduvulu
tETa paracinaTTi dEvuDu
pATimAlinaTTi prANula duritapu
tITa rAsinaTTi dEvuDu
gurutuveTTagarAni guNamula nelakonna
tiruvEMkaTAdripai dEvuDu
tiramuga dhRuvuniki divyapadaMbicci
teraci rAjannaTTi dEvuDu
No comments:
Post a Comment