P.S.RANGANATH
కలియుగమెటులైన కలదుగా నీకరుణ
జలజాక్ష హరి హరీ సర్వేశ్వరా
పాపమెంత కలిగినా పరిహరించేందుకు
నాపాల కలదుగా నీ నామము
కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు
చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు
ధరనింద్రియాలెంత తరుముగాడిననన్ను
సరిగావ కద్దుగా నీశరణాగతి
గరిమ కర్మబంధాలు కట్టిన తాళ్ళూడించ
నిరతి కలదుగా నీ భక్తి నాకు
ఇతమైన ఇహపరాలిష్టమైనవెల్లా నీయా
సతమై కలదుగా నీసంకీర్తనా
తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ
గతి కలదుగా నీ కమలాదేవి
kaliyugameTulaina kaladugaa nIkaruNa
jalajaakSha hari harI sarwESwaraa
paapameMta kaliginaa parihariMcEMduku
naapaala kaladugaa nI naamamu
kOpameMta kaliginaa kocci SAMtamiccuTaku
cEpaTTi kalavugA naa cittamulO nIvu
dharaniMdriyaaleMta tarumugaaDinanannu
sarigaava kaddugaa nISaraNAgati
garima karmabaMdhAlu kaTTina tALLUDiMca
nirati kaladugaa nI bhakti naaku
itamaina ihaparaaliShTamainavellaa nIyaa
satamai kaladugaa nIsaMkIrtanaa
tati SrIvEMkaTESa naatapamu phaliyiMpiMca
gati kaladugaa nI kamalaadEvi
No comments:
Post a Comment