BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday, 3 January 2011

ANNAMAYYA SAMKIRTANALU__MELUKOLUPU



VANIJAYRAM
యెందాకనిద్ర నీకిదే తెల్లవారె గదే 
యిందిరారమణ నీవిటుమేలుకొనవే


కమలనాభుడ నీకు గంగాదినదులెల్ల
నమరనొకమజ్జనంబాయితము సేసె
తమితోడ కనకాద్రి తానె సింహాసనము
విమలమైయొప్పెనదే విచ్చేయవే


హరినీకు అజుడు పంచాంగంబు వినిపించ
నిరతమగువాకిటను నిలిచినాడు
సురలు నీఅవసరము చూచుకొని కొలువునకు
సరవి నాఇత్తపడి సందడించేరు


కాంధేనువు వచ్చె కనుగొనుటకై నీకు
శ్రీమహాదేవి నీ చేయిలాగుకదివో
యీమహిమ శ్రీ వేంకటేశ నీకే చెల్లె
కామించి యన్నియును గైకొంటివిపుడు

yeMdaakanidra nIkidE tellavaare gadE 
yiMdiraaramaNa nIviTumElukonavE

kamalanaabhuDa nIku gaMgAdinadulella
namaranokamajjanaMbaayitamu sEse
tamitODa kanakaadri taane siMhAsanamu
vimalamaiyoppenadE viccEyavE

harinIku ajuDu paMcaaMgaMbu vinipiMca
niratamaguvaakiTanu nilicinaaDu
suralu nIavasaramu cUcukoni koluvunaku
saravi nAittapaDi saMdaDiMcEru

kaamdhEnuvu vacce kanugonuTakai nIku
SrImahaadEvi nI cEyilaagukadivO
yImahima SrI vEMkaTESa nIkE celle
kaamiMci yanniyunu gaikoMTivipuDu


page no 294
kirtana no 436
vol no 2
రాగం భూపాలం 

No comments:

Post a Comment