BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Friday, 3 December 2010

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU



G.BINATI
 హరినెరగని జన్మ మదియేల
సరుసనాతడులేని చదువేల

దయగతొలగినయట్టి తపమేల
భయములేని యట్టి భక్తేల
ప్రియము మానినయట్టి పెనగేల మంచి
క్రియావిరుధ్ధపు కీర్తనలేల

ఫలము లేనియట్టి పనులేల కడు
కలిమిలేనియట్టి  గర్వమేల
బలిమిలేనియట్టి పంతమేల శౌరి
తలచలేనియట్టి తనువది యేల

తనకమరని  దొరతనమేల
చనవులేనియట్టి సలిగేల
యెనలేని శ్రీవేంకటేశ్వరు శరణని
మనగలిగినమీద మరిచింతలేల

harineragani janma madiyEla
sarusanaataDulEni caduvEla

dayagatolaginayaTTi tapamEla
bhayamulEni yaTTi bhaktEla
priyamu maaninayaTTi penagEla maMci
kriyaavirudhdhapu kIrtanalEla

phalamu lEniyaTTi panulEla kaDu
kalimilEniyaTTi  garwamEla
balimilEniyaTTi paMtamEla Souri
talacalEniyaTTi tanuvadi yEla

tanakamarani  doratanamEla
canavulEniyaTTi saligEla
yenalEni SrIvEMkaTESwaru SaraNani
managaliginamIda mariciMtalEla

No comments:

Post a Comment