BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday 6 December, 2010

ANNAMAYYA SAMKIRTANALU__SARANAGATI


ANANDABHATTAR
నీకే శరణు నీవు నన్ను కరుణించు
నీకడ నాకడదిక్కు ఎవరున్నారికను
చరణం:-1
కన్నుల చంద్రసూర్యులుగలవేలుపవు నీవు
పన్నిన లక్ష్మీభూమి పతివి నీవు
అన్నిట బ్రహ్మకు తండ్రియైన యాదివేలుపవు
ఎన్నగ నీకంటే ఘనమెవరున్నారికను
చరణం:-2
దేవతలందరు నీ తిరుమేనైనమూర్తి
ఆవల పాదాలలోకమణచితివి
నీవొక్కడవే నిలిచినదేవుడవు
ఏవేళ నీకంటే నెక్కుడెవరున్నారికను
చరణం:-3
అరసి జీవులకెల్ల యంతరాత్మయైన హరి
సిరుల వరములిచ్చె శ్రీవేంకటేశా
పురుషోత్తముడవు భువనరక్షకుడవు
ఇరవైన నీవెకాక ఎవరున్నారికను

nIkE SaraNu nIvu nannu karuNiMcu
nIkaDa naakaDadikku evarunnaarikanu
charaNaM:-1
kannula chaMdrasooryulugalavElupavu nIvu
pannina lakShmIbhoomi pativi nIvu
anniTa brahmaku taMDriyaina yaadivElupavu
ennaga nIkaMTE ghanamevarunnaarikanu
caraNaM:-2
dEvatalaMdaru nI tirumEnainamUrti
aavala paadaalalOkamaNacitivi
nIvokkaDavE nilicinadEvuDavu
EvELa nIkaMTE nekkuDevarunnaarikanu
caraNaM:-3
arasi jIvulakella yaMtaraatmayaina hari
sirula varamulicce SrIvEMkaTESA
puruShOttamuDavu bhuvanarakShakuDavu
iravaina nIvekaaka evarunnaarikanu

No comments:

Post a Comment