నవనారసింహా నమో నమో
భవనాశితీర యహోబలనారసింహా
సతతప్రతాప రౌద్రజ్వాలా నారసింహా
వితతవీరసింహవిదారణా
అతిశయకరుణ యోగానంద నరసింహ
మతిశాంతపుకానుగుమానినారసింహ
మరలి బీభత్సపుమట్టెమళ్ళనరసింహ
నరహరి భార్గోటినారసింహ
పరిపూర్ణశౄంగార ప్రహ్లాదనరసింహ
సిరుల నద్భుతపులక్ష్మీనారసింహ
వదనభయానకపువరాహనరసింహ
చెదరనివైభవాల శ్రీనరసింహా
అదన శ్రీవేంకటేశ అందు నిందు నిరవైతి
పదివేలురూపముల బహునారసింహ
navanArasiMhA namO namO
BavanASitIra yahObalanArasiMhA
satatapratApa raudrajvAlA nArasiMhA
vitatavIrasiMhavidAraNA
atiSayakaruNa yOgAnaMda narasiMha
matiSAMtapukAnugumAninArasiMha
marali bIBatsapumaTTemaLLanarasiMha
narahari BArgOTinArasiMha
paripUrNaSRuMgAra prahlAdanarasiMha
sirula nadButapulakShmInArasiMha
vadanaBayAnakapuvarAhanarasiMha
cedaranivaiBavAla SrInarasiMhA
adana SrIvEMkaTESa aMdu niMdu niravaiti
padivElurUpamula bahunArasiMha
No comments:
Post a Comment