SRGRM
కలలోనే ఇరువురము అలిగి వేగ
కలయనుచు తెలిసి నిను కౌగలించితిరా
అలుగుదురె సతులు బతులనగా వినగా
అలవాటులేకనే అలుగుచుందునురా
అలిగితట ఉరకనీవంత నాతోను మరి
అలుగులౌనట పూవులంతలోపలనే
చందురుడే సూర్యుడే జరగ మిగుల
కెందమ్ములవురా నాకెంగేలుదోయి
గంధమే తోచెనట కస్తూరియనగా నా
చందమపుడొకలాగు చందమౌనటరా
విటవరుడ కోనేటివిభుడా నీ
వెటు దొలంగిన దేహమెట్టు నిలుపుదురా
ఎటువలెనే తనలోన యెలమి మరచి
తటుకునను కలయనుచు తలచ తెలసెనురా
kalalOnE iruvuramu aligi vEga
kalayanucu telisi ninu kougaliMcitiraa
alugudure satulu batulanagaa vinagaa
alavaaTulEkanE alugucuMdunuraa
aligitaTa urakanIvaMta naatOnu mari
alugulounaTa pUvulaMtalOpalanE
caMduruDE sUryuDE jaraga migula
keMdammulavuraa naakeMgEludOyi
gaMdhamE tOcenaTa kastUriyanagaa naa
caMdamapuDokalaagu caMdamounaTaraa
viTavaruDa kOnETivibhuDA nI
veTu dolaMgina dEhameTTu nilupuduraa
eTuvalenE tanalOna yelami maraci
taTukunanu kalayanucu talaca telasenuraa
No comments:
Post a Comment