G.MADHUSUDANARAO
అంగనకు విరహమే సింగారమాయ
చెంగట నీవే యిది చిత్తగించవయ్యా
కలికి నిన్ను తలచి గక్కున లోలో కరగి
జలజల జెమరించి జలకమాడే
బలుతమకాన నీకు పక్కన నెదురూ వచ్చి
నిలువున కొప్పు వీడి నీలిచీరగప్పేను
సుదతి నిన్ను జూచి సోయగపుసిగ్గులను
పొదలి చెక్కులదాకా బూసె గంధము
మదనమంత్రములైనమాటల మర్మము సోకి
ముదురుబులకల్ను ముత్యాలు గట్టెను
గక్కన కౌగిట నిన్ను గలసీ యీమానిని
చొక్కి చంద్రాభరణపు సొమ్ములువెట్టె
అక్కున శ్రీవేంకటేశ అలమేలుమంగ నీకు
దక్కి సరసములను తలంబ్రాలు వోసె
aMganaku virahamE siMgAramaaya
ceMgaTa nIvE yidi cittagiMcavayyaa
kaliki ninnu talaci gakkuna lOlO karagi
jalajala jemariMci jalakamaaDE
balutamakaana nIku pakkana nedurU vacci
niluvuna koppu vIDi nIlicIragappEnu
sudati ninnu jUci sOyagapusiggulanu
podali cekkuladAkA bUse gaMdhamu
madanamaMtramulainamATala marmamu sOki
mudurubulakalnu mutyAlu gaTTenu
gakkana kougiTa ninnu galasI yImaanini
cokki caMdraabharaNapu sommuluveTTe
akkuna SrIvEMkaTESa alamElumaMga nIku
dakki sarasamulanu talaMbrAlu vOse
ANNAMAYYA LYRICS BOOK NO--21
SAMKIRTANA NO--415
RAGAM MENTIONED--SRIRAGAM
No comments:
Post a Comment