BKP
నీవు నాసొమ్మవు నేను నీ సొమ్ము
యీవల నీవెపుడూ మా యింటనుండ తగవా
హరి నీరూపము నాకు ఆచార్యుడు మున్నే
కెరలి నాపాలనప్పగించినాడు
నరహరీ నిను నేనన్యామున తెలియను
పొరపడి నీకెందు పోదగునా
జనని నీదేవి లక్ష్మి జంకుడవునీవే
తనువులును ఆత్మగౌరవమ్మునీవే
అనయము నేనెంత అపరాధినైనాను
పనివడి నీవునన్ను పాయతగునా
బహువేదములు నిన్ను భక్తవత్సలుడవని
సహజబిరుదు భువిని చాటీని
ఇహమున శ్రీవేంకటేశా ఇదితలచైనా
విహితమై నాకడకు విచ్చేయవే
nIvu naasommavu nEnu nI sommu
hari nIrUpamu naaku aacaaryuDu munnE
kerali naapaalanappagiMcinaaDu
naraharI ninu nEnanyaamuna teliyanu
porapaDi nIkeMdu pOdagunaa
janani nIdEvi lakShmi jankuDavunIvE
tanuvulunu aatmagouravammunIvE
anayamu nEneMta aparaadhinainaanu
panivaDi nIvunannu paayatagunaa
bahuvEdamulu ninnu bhaktavatsaluDavani
sahajabirudu bhuvini caaTIni
ihamuna SrIvEMkaTESA iditalacainaa
vihitamai naakaDaku viccEyavE
No comments:
Post a Comment