BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Tuesday, 23 November 2010

ANNAMAYYA SAMKIRTANALU__TATWAMULU


CKP
వేఱొకచోట లేడు వీడివో హరి
వీఱిడియై చేరువనే వీడివొ హరి.


మునుకొని వెదకితే ముక్కుమార్పుగాలికొన
వెనవెనక దిరిగీ వీడివొ హరి
పెనగి వెదకబొతే పెడచెవులమంత్రమై
వినవచ్చీ మాటలలొ వీడివొ హరి.


శోధించి వెదకితేను చూపులకొనలనే
వీధుల నెందు చూచినా వీడివొ హరి
ఆదిగొని వెదకితే అట్టే నాలికకొన
వేదమై నిలిచినాడు వీడివొ హరి.


తెలిసి వెదకబొతే దేహపుతంటరాత్మయై
వెలుపలా లొపలాను వీడివొ హరి
చెలగి శ్రీవేంకటాద్రి చేకొని మమ్ము రక్షించ
వెలసె నిందరు జూడ వీడివొ హరి.
verolachotaledu
Vae~rokachOTa laeDu veeDivO hari
Vee~riDiyai chaeruvanae veeDivo hari.


munukoni vedakitae mukkumaarpugaalikona
venavenaka dirigee veeDivo hari
penagi vedakabotae peDachevulamamtramai
vinavachchee maaTalalo veeDivo hari.

SOdhimchi vedakitaenu choopulakonalanae
Veedhula nemdu choochinaa veeDivo hari
Adigoni vedakitae aTTae naalikakona
Vaedamai nilichinaaDu veeDivo hari.


telisi vedakabotae daehaputamTaraatmayai
Velupalaa lopalaanu veeDivo hari
Celagi SreevaemkaTaadri chaekoni mammu rakshimcha
Velase nimdaru jooDa veeDivo hari.

No comments:

Post a Comment