G.NAGESWARA NAIDU
జో జో దీనజనావనలోల
జోజో యదుకుల.తిలకా గోపాలా
చరణం:-1
వేదములు రత్నాల గొలుసులై అమర
వేదాంతమపరంజి తొట్లగానమర
నాదము ప్రణవము పానుపై అమర
ప్రణవార్ధమై ఇచట పవళించు స్వామీ
చరణం:-2
అతిచిత్రముగ పది అవతారముల బ్రోవ
అమరుచు పదునాల్గు జగముల బ్రోవ
ప్రతియుగంబందున జనియించు మిగుల
ప్రబలి జన్మరహితుండనుకొన్న స్వామీ
చరణం:-3
శాంతియు మణిమయ మకుటమై మెరయ
శక్తులు మహాహారంబులై మెరయ
దాంతియు కుసుమమాలికలై మెరయ
ధరలో శ్రీవేంకటేశ రమణుడౌ స్వామీ
jO jO dInajanaavanalOla
jOjO yadukula.tilakaa gOpaalaa
charaNaM:-1
vEdamulu ratnaala golusulai amara
vEdaaMtamaparaMji toTlagaanamara
naadamu praNavamu paanupai amara
praNavaardhamai icaTa pavaLiMcu swaamI
charaNaM:-2
atichitramuga padi avataaramula brOva
amarucu padunaalgu jagamula brOva
pratiyugaMbaMduna janiyiMcu migula
prabali janmarahituMDanukonna swaamI
charaNaM:-3
SAMtiyu maNimaya makuTamai meraya
Saktulu mahaahaaraMbulai meraya
dAMtiyu kusumamaalikalai meraya
dharalO SrIvEMkaTESa ramaNuDou swaamI
No comments:
Post a Comment