NELAMUDU_F
నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా
రామనామమతనిది రామవు నీవైతేను
చామన వర్ణమతడు చామవు నీవు
వామనుడందురతని వామనయనవు నీవు
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే
హరిపేరాతనికి హరిణేక్షణవు నీవు
కరిగాచెదాను నీవు కరియానవు
సరిజలధిశాయి జలధికన్యవునీవు
వెరసి మీయిద్దరికి పేరుబలమొకటే
జలజ నాభుడతడు జలజముఖివి నీవు
అలమేలుమంగవు నిన్నెలమెదాను
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె
పిలిచి పేరుచెప్పె పేరుబలమొకటే
G.NAGESWARA NAIDU
nelamUDu SOBanAlu nIku natanikidagu
kalakAlamunu niccakalyANamammA
rAmanAmamatanidi rAmavu nIvaitEnu
cAmana varNamataDu cAmavu nIvu
vAmanuDaMduratani vAmanayanavu nIvu
prEmapumI yiddariki pErubalamokaTE
haripErAtaniki hariNEkShaNavu nIvu
karigAcedAnu nIvu kariyAnavu
sarijaladhiSAyi jaladhikanyavunIvu
verasi mIyiddariki pErubalamokaTE
jalaja nABuDataDu jalajamuKivi nIvu
alamElumaMgavu ninnelamedAnu
ilalO SrIvEMkaTESuDiTu ninnurAnamOce
pilici pEruceppe pErubalamokaTE
No comments:
Post a Comment