P.S.RANGANATH
వేంచేయరయ్య మీరు విడిదిండ్లకు
పాంచజన్యధరుడు పవ్వళించిఉన్నాడు
గరుడు కిన్నరకింపురుషులారా,సిద్ధ
వరులార విద్యాధరులారా
గిరివల్లభులార శరణాగతత్రాణ-
బిరుదు వేల్పుని నగరు వీగముద్రలాయె
వేదాంబుధులార విబుధగణములార,సన-
కాది మునులార ఘనులార
ఆదిత్యులారా గ్రహములార దానవ-
వేదినగరు తలుపు వీగముద్రలాయె
నాగకంకణులారా గణనాయకులార
భాగవతులార దిక్పతులారా
బాగుగ అలమేలుమంగపతి వేంకటేశ్వర
భోగివేల్పు నగరు వీగముద్రలాయె
vEMcEyarayya mIru viDidiMDlaku
paaMcajanyadharuDu pavvaLiMciunnaaDu
garuDu kinnarakiMpuruShulaaraa,siddha
varulaara vidyaadharulaaraa
girivallabhulaara SaraNAgatatrANa-
birudu vElpuni nagaru vIgamudralaaye
vEdaaMbudhulaara vibudhagaNamulaara,sana-
kaadi munulaara ghanulaara
aadityulaaraa grahamulaara daanava-
vEdinagaru talupu vIgamudralaaye
naagakaMkaNulaaraa gaNanaayakulaara
bhaagavatulaara dikpatulaaraa
baaguga alamElumaMgapati vEMkaTESwara
bhOgivElpu nagaru vIgamudralaaye
No comments:
Post a Comment