SRGRM
అలమేలుమంగనీ యభినవరూపము
జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మ
గరుడాచలాధీసు ఘనవక్షముననుండి
పరమానంద సంభిరతవై
నెరతనములు జూపి నిరంతరమునాథుని
హరుషింపగ జేసితిగదమ్మా
శశికిరణములకు చలువలచూపులు
విశదముగా మీద వెదజల్లుచు
రసికత పెంపున కరగించి ఎప్పుడు నీ
వశముజేసుకొంటి వల్లభునోయమ్మా
రట్టడి శ్రీవేంకటరాయనికి నీవు
పట్టపురాణివై పరగుచు
వట్టిమాకులిగిరించు వలపుమాటల విభు-
జట్టిగొని వురమున సతమైతివమ్మా
D.V.MOHANA KRISHNA
alamElumamganee yabhinavaroopamu
jalajaakshu kannulaku chavulichchEvamma
garuDaachalaadheesu ghanavakshamunanumDi
paramaanamda sambhiratavai
neratanamulu joopi niramtaramunaathuni
haruShimpaga jEsitigadammaa
SaSikiraNamulaku chaluvalachoopulu
viSadamugaa meeda vedajalluchu
rasikata pempuna karagimchi eppuDu nee
VaSamujEsukomTi vallabhunOyammaa
raTTaDi SreevEnkaTaraayaniki neevu
paTTapuraaNivai paraguchu
vaTTimaakuligirimchu valapumaaTala vibhu-
jaTTigoni vuramuna satamaitivammaa
No comments:
Post a Comment