P.RANGANATH
చేరివచ్చెను అలమేలుమంగ
జిలుగు పైఎద జారగా
అనుపల్లవి:-
గారవమ్మున వేంకటపతి పడకిల్లు
తీరని ప్రేమతో తిరిగి చూచుకొంటా
చరణం:-1
ముడిపూలు రాలగా ముంగురుల శ్యామా
విడెము కప్పుర తావి వెదజల్లగా
ఒడలు వాగుదేర ఒంటికట్టుతోను
పడతి రవలగింఫు పావడ మెట్లతో
చరణం:-2
నికరంపు జవ్వాది నిగ్గుల కస్తూరి
అగరు కుంకుమ అందుకొని
మగువ మోము నిదుర మబ్బు తేరగాను
నొగిలిన కెమ్మోవి నొక్కులతోడను..
chErivachchenu alamElumaMga
jilugu paieda jAragA
anupallavi:-
gAravammuna vEMkaTapati paDakillu
tIrani prEmatO tirigi chUchukoMTA
charaNaM:-1
muDipUlu rAlagA muMgurula SyAmA
viDemu kappura tAvi vedajallagA
oDalu vAgudEra oMTikaTTutOnu
paDati ravalagiMPu pAvaDa meTlatO
charaNaM:-2
nikaraMpu javvAdi niggula kastUri
agaru kuMkuma aMdukoni
maguva mOmu nidura mabbu tEragAnu
nogilina kemmOvi nokkulatODanu..
No comments:
Post a Comment