RAGAMALIKA
జపియించరే సర్వజనులు యీ నామము
తమరపమును పుణ్యాలకు రామనామము
శాంతికరము రామచంద్రనామము
భ్రాంతులణచు రామభద్రనామము
వింతసుఖమిచ్చు రఘువీరనామము భూమి
చింతదీర్చునదివో శ్రీరామనామము
కలిదోషహరము రాఘవనామము సర్వ
ఫలదము సీతాపతినామము
కులకశోభనము కాకుత్సనామము
అనిరళమైనదిదివో రామనామము
గుమితమైనదీ రఘుకులనామము అతి
సుముఖము దశరధసుతనామము
అమితమై శ్రీవేంకటాద్రినాయకుడై
రమియించే యీతని రామనామము
japiyiMcarE sarvajanulu yI naamamu
tamarapamunu puNyAlaku raamanaamamu
SAMtikaramu raamacaMdranaamamu
bhraaMtulaNacu raamabhadranaamamu
viMtasukhamiccu raghuvIranaamamu bhUmi
ciMtadIrcunadivO SrIraamanaamamu
kalidOShaharamu raaghavanaamamu sarwa
phaladamu sItaapatinaamamu
kulakaSOBanamu kaakutsanaamamu
aniraLamainadidivO raamanaamamu
gumitamainadI raghukulanaamamu ati
sumukhamu daSaradhasutanaamamu
amitamai SrIvEMkaTAdrinaayakuDai
ramiyiMcE yItani raamanaamamu
No comments:
Post a Comment