AUDIO LINK
తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు
మనసు చంచల బుద్ధి మానీనా
జడ్డు మానవుడు చదువ జదువు నాస
వడ్డివారుగాక వదలీనా
గుడ్డికుక్క సంతకుబోయి తిరిగిన
దుడ్డు పెట్లే కాక దొరకేనా
దేవదూషకుడై తిరిగేటి వానికి
దేవతాంతరము తెలిసీనా
శ్రీవేంకటేశ్వరు సేవాపరుడుగాక
పావనమతియై పరగీనా
tanakEDa caduvulu tanakEDa SAstrAlu
manasu caMcala buddhi mAnInA
jaDDu mAnavuDu caduva jaduvu nAsa
vaDDivArugAka vadalInA
guDDikukka saMtakubOyi tirigina
duDDu peTlE kAka dorakEnA
dEvadUShakuDai tirigETi vAniki
dEvatAMtaramu telisInA
SrIvEMkaTESvaru sEvAparuDugAka
pAvanamatiyai paragInA
No comments:
Post a Comment