వెన్నముద్ద కృష్ణుడు వేవేలచేతలవాడు
పిన్నవాడై వున్నవాడు బిరుదైన బాలుడు
చరణం:-1
బాలింత చన్నుగుడిచి బండి విరుగగ దన్ని
గాలి రక్కసుని ములుగగ మోది
రోలగట్టు వడియట్టె రూఢిగా మద్దిమాకుల
కూలదొబ్బె తొల్లివీడే గుట్టుతోడి బాలుడు
చరణం:-2
కొండగొడుగుగ బట్టి గోకులమునెల్లగాచి
మెండ గోగొల్లెతలతో మేలమాడి
అండనే నోరుతెరచి యశోదకు లోకములు
దండిగా చూపెనితడే దంటయైన బాలుడు
చరణం:-3
పరమేష్ఠికి మారొడ్డి పసిబాలకుల దెచ్చి
ధర పదియారువేల కాంతల పెండ్లాడి
ఇరవై శ్రీవేంకతాద్రి నిందరికీ వరాలిచ్చి
సిరితో వెలసేనిదే చెలువపు బాలుడు
vennamudda kRShNuDu vEvElachEtalavaaDu
pinnavaaDai vunnavADu birudaina baaluDu
charaNaM:-1
baaliMta cannuguDici baMDi virugaga danni
gaali rakkasuni mulugaga mOdi
rOlagaTTu vaDiyaTTe rUDHigaa maddimaakula
kUladobbe tollivIDE guTTutODi baaluDu
caraNaM:-2
koMDagoDuguga baTTi gOkulamunellagaaci
meMDa gOgolletalatO mElamaaDi
aMDanE nOruteraci yaSOdaku lOkamulu
daMDigaa cUpenitaDE daMTayaina baaluDu
caraNaM:-3
paramEShThiki maaroDDi pasibaalakula decci
dhara padiyaaruvEla kaaMtala peMDlADi
iravai SrIvEMkatAdri niMdarikI varaalicci
siritO velasEnidE celuvapu baaluDu
No comments:
Post a Comment