BALANTRAPUVARI BLOG

BALANTRAPUVARI BLOG
NISHKALMASHAMAINA BHAKTIYE MOKSHASADHANAMU

Monday, 27 September 2010

ANNAMAYYA SAMKIRTANALU_TATWAMULU

AUDIO LINK



ఇన్నియు ముగిసెను ఇటు నీలోననే  
పన్ని పరుల చెప్పగ చోటేది 

కుందని నీ రోమకూపంబులలో 
గొందుల బ్రహ్మాండ కోట్లట 
యెందరు బ్రహ్మలో యెంత ప్రపంచమో 
యిందు పరులమని యెంచగ నేది 

నీ కొన చూపున నెరి కోటి సూర్యులు 
ఏకమగుచు నుదయించురట 
నీ కాయమెంతో నీ వునికేదో 
నీకంటె పరులని నిక్కగ నేది 

జీవకోటి నీ చిన్ని మాయలో 
ప్రోవులగుచు నటు పొడమె నట 
శ్రీవేంకటేశ్వర చెప్పగ నీవెంతో
ఆవల పరులకు ఆధిక్య మేది 


inniyu mugisenu iTu nIlOnanE
panni parula ceppaga cOTEdi

kuMdani nI rOmakUpaMbulalO
goMdula brahmAMDa kOTlaTa
yeMdaru brahmalO yeMta prapaMcamO
yiMdu parulamani yeMcaga nEdi

nI kona cUpuna neri kOTi sUryulu
Ekamagucu nudayiMcuraTa
nI kAyameMtO nI vunikEdO
nIkaMTe parulani nikkaga nEdi

jIvakOTi nI cinni mAyalO
prOvulagucu naTu poDame naTa
SrIvEMkaTESvara ceppaga nIveMtO
Avala parulaku Adhikya mEdi 


No comments:

Post a Comment