http://www.esnips.com/doc/2a5601bf-873c-4581-8cff-6c25eabd85f3/07---Jaganmaata-Chakravakam
జగన్మాత నీకింత అలుకేలనమ్మ
జగన్నాధ సన్నిధినే చేరరావమ్మ
చరణం - 1
శ్రీమందిరమిలలోన చిన్నపోయె శ్రీపురిలొ
శ్రీమంగళాంబనీవు సేమమ కాకట్పురిలొ
మిమ్ముపలుకరించవచ్చె మీసుభద్రమ్మయదె
తమ్మునితో కుశలమడిగె తానె బలరాముడు
చరణం - 2
నల్లని నీ విభుని ఒల్లనని విడనాడి
అల్లంత దూరాన అమరినావు ఏమొకొ
తెల్లని కన్నుల స్వామి తల్లడిల్లినాడుగదె
మెల్లన ఏజాముకైన నిన్నుచేరునమ్మ
చరణం - 3
అగ్రతాంబూలము అదినీకు అన్నిటాను
ఉగ్రరూపమును మాని ఊసులాడవమ్మా
నిగ్రహమున నీలాద్రి నిడివి తాను కొలచినాడు
ఆగ్రహమును ఆదమరచి అనుగ్రహింపవోయమ్మ
సంకీర్తన - 6, రాగం - చక్రవాకం"
jaganmaata nIkiMta alukElanamma
jagannaadha sannidhinE chEraraavamma
charaNaM - 1
SrImaMdiramilalOna chinnapOye SrIpurilo
SrImaMgaLaaMbanIvu sEmama kaakaTpurilo
mimmupalukariMchavachche mIsubhadrammayade
tammunitO kuSalamaDige taane balaraamuDu
charaNaM - 2
nallani nI vibhuni ollanani viDanaaDi
allaMta dUraana amarinaavu Emoko
tellani kannula swaami tallaDillinaaDugade
mellana Ejaamukaina ninnuchErunamma
charaNaM - 3
agrataaMbUlamu adinIku anniTaanu
ugrarUpamunu maani UsulaaDavammA
nigrahamuna nIlaadri niDivi taanu kolachinaaDu
aagrahamunu aadamarachi anugrahiMpavOyamma
saMkIrtana - 6, raagaM - chakravaakaM"
No comments:
Post a Comment