CHAKRAPANI
అన్ని సింగారాలు నీకె అమరుగాక
యన్నిటా దేవతలు నిన్నిందుకే మెచ్చేరు
చందురుని వంటిమోము జలజాలే కన్నులట
యిందిర నీకే తగు నీకొత్తలు
గొంది నొకటొకటికి( గూడవందు రివి నీకు
పొందై పాలవెల్లి తోడబుట్లే కావా
ముక్కు సంపెంగవంటిది ముంగురులు తేంట్లట
ఇక్కువలు నీకే తగు నీ కొత్తలు
అక్కున వరలక్ష్మివి హరి వసంతమాధవు
డెక్కడా మీ కిద్దరికి యెనయికే కాదా
ధర నడుము సింహము తగు గజగమనాలు
తిరమై శ్రీవేంకటేశుదేవి నీకే పో
నరసింహుడై యుండి కరిగాచినట్టివాని-
సురత మందితిగాన చుట్టమువేకావా
anni simgArAlu nIke amarugAka
yanniTA dEvatalu ninniMdukE mechchEru
chaMduruni vaMTimOmu jalajAlE kannulaTa
yiMdira nIkE tagu nIkottalu
goMdi nokaTokaTiki( gUDavaMdu rivi nIku
poMdai pAlavelli tODabuTlE kAvA
mukku saMpeMgavaMTidi muMgurulu tEMTlaTa
ikkuvalu nIkE tagu nI kottalu
akkuna varalakshmivi hari vasaMtamAdhavu(
DekkaDA mI kiddariki yenayikE kAdA
dhara naDumu siMhamu tagu gajagamanAlu
tiramai SrIvEMkaTESudEvi nIkE pO
narasiMhuDai yuMDi karigAchinaTTivAni-
surata maMditigAna chuTTamuvEkAvA
No comments:
Post a Comment